• Home
  • Film
  • Reviews
  • Galleries
  • Home
  • Film
  • Political
  • Videos
  • Collections
  • Tech
  • Life Style
  • Reviews
  • Galleries
loading topItems
Trending
    loading trends
తెలుగు
You are atHomemovie reviewsరోషగాడు తెలుగు మూవీ రివ్యూ

రోషగాడు తెలుగు మూవీ రివ్యూ

  • Nov 17, 2018
  • 717 views
Roshagadu
నటీనటులు: విజయ్ అంటోనీ, నివేత పెతురాజ్
దర్శకుడు: గణేశా
నిర్మాత: ఫాతిమా విజయ్ అంటోనీ
సంగీతం: విజయ్ ఆంటోని
విడుదల తేది: నవంబర్ 16, 2018
రేటింగ్‌:
2 / 5
Review in english
రోషగాడు - కథ
పోలీస్ కానిస్టేబుల్ అయిన కుమార స్వామి (విజయ్ ఆంటొని ) తన తమ్ముడు రవి ని ఎలాగైనా ఇన్స్పెక్టర్ ను చేయాలనీ అనుకుంటాడు కానీ చదువు అంటే ఏం మాత్రం ఇష్టముండని రవి హైదరాబాద్ పారిపోయి అక్కడి రౌడీ (బాబ్జి ) దగ్గర చేరి హత్యలు చేస్తుంటాడు. రెండు సంవత్సరాల తరువాత ఇన్స్పెక్టర్ గా హైదరాబాద్ కు బదిలీ మీద వచ్చిన కుమార స్వామి కి తన తమ్ముడు కలవడం అతను చేసే హత్యల గురుంచి తెలుసుకొని ఎన్కౌంటర్ లో రవిని చంపేస్తాడు కుమార స్వామి. కానీ తన తమ్ముడులాగే మరి కొంత మంది పిల్లలు కూడా బాబ్జి కోసం పనిచేస్తున్నారని తెలుసుకొని కుమార్ స్వామి వారందరిని మార్చాలనుకుంటాడు. ఈ క్రమంలో కుమార స్వామి అనుకున్నది చేయగలిగాడు ? ఇంతకీ బాబ్జి ఎవరు ? అనేదే మిగితా కథ.
రోషగాడు - నటీనటుల ప్రతిభ
తన ప్రతీ సినిమాలో ఓ ఎమోషనల్‌ పాయింట్‌ ఉండేలా చూసుకునే విజయ్‌ ఆంటొని ఈ సినిమా కూడా అదే స్టైల్‌ లో సెలెక్ట్ చేసుకున్నాడు. తమ్ముడి సెంటిమెంట్‌ తో తెరకెక్కిన ఈ సినిమాతో మరోసారి తన మార్క్‌ చూపించాడు విజయ్‌. కుమారస్వామి పాత్రలలో సెటిల్డ్‌ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్‌ యాక్షన్‌ సీన్స్‌లోనూ మెప్పించాడు. హీరోయిన్‌గా నటించిన నివేదా పేతురాజ్‌ చలాకీ అమ్మాయి పాత్రలో ఒదిగిపోయింది. లుక్స్‌ పరంగాను మంచి మార్కులు సాధించింది. ఇక కీలక మైన విలన్‌ పాత్రలో నటించిన సాయి దీనా, బాబ్జీ పాత్రకు పర్ఫెక్ట్‌గా సూట్‌ అయ్యాడు. మిగతా నటీనటులంతా తమిళ వాళ్లే కావటంతో తెలుగు ప్రేక్షకులు పెద్దగా కనెక్ట్ కాలేరు.
రోషగాడు - సాంకేతిక వర్గం పనితీరు
దర్శకుడు గణేషా.. విజయ్‌ ఆంటొని ఇమేజ్‌కు తగ్గ కథా కథనాలను రెడీ చేసుకున్నా.. అనుకున్నట్టుగా సినిమాను తెర మీద చూపించటంలో కాస్త తడబడ్డాడు. అక్కడక్కడా కథనం కాస్త నెమ్మదించినా ఎమోషనల్‌ సీన్స్‌తో పాటు కామెడీ డైలాగ్స్‌ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లోకథనం నెమ్మదిగా సాగుతూ ప్రేక్షకులను విసిగిస్తుంది. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ బాగుంది. ఉన్నవి మూడు పాటలే అయినా అవికూడా తెలుగు ప్రేక్షకులను అలరించేలా లేవు. నేపథ్య సంగీతం మాత్రం సినిమాకు తగ్గట్టుగా కుదిరింది. ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిమాటోగ్రఫి నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
రోషగాడు - విశ్లేషణ
డిఫరెంట్ స్టోరీ తో ‘రోషగాడు’ గా ప్రేక్షకులముందుకు వచ్చిన విజయ్ ఆంటొని కి ఈచిత్రం మరో ‘బిచ్చగాడు’ అవ్వలేకపోయింది. డైరెక్షన్ లోపాలు అలాగే ఎంటెర్టైనెంట్ లేకపోవడం , స్లో నరేషన్ వల్ల ఈచిత్రం సాదా సీదాగా మిగిలిపోయింది.. అయితే విజయ్ సిన్సియర్ యాక్టింగ్ అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు చిత్రానికి హైలైట్ గా నిలిచాయి. చివరగా మాస్ ఎలిమెంట్స్ తో వచ్చిన ఈ చిత్రం ఏ సెంటర్ల ప్రేక్షకులను మెప్పించలేకపోయిన బి,సి సెంటర్ల ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే అవకాశాలుఉన్నాయి.
రోషగాడు - ట్రైలర్
NewsGalleriesHot Galleries

TeluguBoard is a popular online newsportal and going source for technical and digital content for
its influential audience around the globe. You can reach us via email.

info@teluguboard.com

© 2017 TeluguBoard. All Rights Reserved.

Developed By
VENNAG

top
Hit enter to search or ESC to close